×

صفة العمرة (تلقو)

الوصف

مقالة قيمة في بيان أحكام العمرة وآدابها.

تنزيل الكتاب

 ఉమ్రా విధానం

﴿ صفة العمرة ﴾

] తెలుగు – Telugu – تلغو [

http://ipcblogger.net/salimumri/

అనువాదం : -

పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

2009 - 1430

﴿ صفة العمرة ﴾

« باللغة التلغو »

http://ipcblogger.net/salimumri/

ترجمة : -

مراجعة : محمد كريم الله

2009 - 1430

 ఉమ్రా విధానం ఉమ్రా నెరవేర్చాలన్న సంకల్పంతో మస్జిదె హరామ్ చేరుకున్నప్పుడు కుడికాలు లోపలికి పెట్టి, ఈ దుఆ పఠిస్తూ మస్జిదె హరామ్ లో ప్రవేశించాలి. “బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లహుమ్మగ్ ఫిర్లి జునూబి వఫ్తహ లిఅబువాబ రహమతిక్ అవూజు బిల్లాహిల్ అజీం వ బివజ్హిహిల్ కరీం వ బిసుల్తానిహిల్ ఖధీం మినష్షయితానిర్రజీం”. కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వీకరించబడవచ్చని గుర్తుంచుకోండి. తరువాత తవాఫ్ (ప్రదక్షిణ) మొదలు పెట్టడానికి హజ్రే అస్వద్ (నల్లరాయి) వైపు సాగిపోవాలి. వీలయితే దాన్ని ముద్దాడాలి. వీలుకాని ఎడల చేత్తో తాకాలి లేదా సైగ చేసినా సరిపోతుంది. దాన్ని ముద్దాడే ప్రయత్నంలో ఇతర యాత్రికులను తోసి వేయకూడదు. హజ్రే అస్వద్ ని తాకేటప్పుడు ఈ దుఆ పఠించాలి: బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అల్లాహుమ్మ ఈమానంబిక, వతస్దీఖన్ బికితాబిక, వ వఫాఅన్ బి అహ్దిక వ ఇత్తిబాఅన్ లిసున్నటి నబియ్యిక సల్లలాహు అలైహి వసల్లం. ప్రతి ప్రదక్షిణ హజ్రే అస్వద్ నుండి ప్రారంభమై హజ్రే అస్వద్ దగ్గరే ముగుస్తుంది. రుక్నే యమానీని వీలయితే చేత్తో తాకాలి. వీలు లేకపోతే సైగ చెయ్యకూడదు. ముద్దాడకూడదు. రుక్నెయమాని హజ్రే అస్వద్ ల మధ్య ఈ దుఆ పఠించాలి: రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.” తవాఫ్ కోసం పరిశుద్ధత (తహారత్ ) మరియు వుదూ అవసరం. అలాగే ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు కాబా మీకు ఎడమవైపు నుండాలి. మొదటి మూడు ప్రదక్షిణలలో భుజాలపై నున్న ఇహ్రాం వస్త్రం నుండి కుడి భుజాన్ని తెరచి వుంచటం మంచిది. అలాగే మొదటి మూడు ప్రదక్షిణలలో వడివడిగా నడవడం అభిలషనీయం. ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప, మఖామే ఇబ్రాహీం దగ్గర రెండు రకాతుల నమాజ్ వీలైతే చెయ్యాలి. అలా కుదరని ఎడల మస్జిదె హరాం లోపలనే ఎక్కడ వీలైతే అక్కడ ఆ రెండు రకాలు పూర్తిచేయాలి. మొదటి రకాతులో “ఫాతిహా సూరా” తరువాత “ఖుల్యా అయ్యుహల్ కాఫిరూన్” రెండవ రకాతులో “ఖుల్హు వల్లాహు అహద్” పఠించాలి. తరువాత జంజం నీరు త్రాగడం అభిలషనీయం. మళ్లీ అక్కడి నుండి బయలుదేరి సఫా కొండ వద్దకు చేరుకోవాలి. సయీ: ఇప్పుడు మీరు సఫా కొండను సమీపించారు. ఇప్పుడు “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆ యిరిల్లాహ్” అనే ఆయత్ పఠించాలి. తరువాత మెల్లగా కొండపైకి చేరుకోవాలి. కాబా వైపుకి తిరిగి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠించినట్లుగా ఈ దుఆని పఠించాలి: లా ఇలాహ ఇల్లలాహు వహదహూ, లా షరిక లహూ లహూల్ ముల్కు, వ లహూల్ హమ్డు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లలాహు వహదహూ, అంజజ వఅదహు వ నాసర అబ్దుహూ, వాహజమల్ అహ్ జాబ వహ్ దహూ” పై దుఆ మూడు సార్లు చదవిన తర్వాత మీకు ఇష్టమైన దుఆలు చెయ్యాలి. ఆ తరువాత సఫా నుండి సయీని ప్రారంభించి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు - అలా ఏడు సార్లు సయీ చెయ్యాలి. పచ్చటి గుర్తున్న లైట్ల మధ్య పురుషులు మాత్రం వేగంగా నడవాలి. ఆ తరువాత బయట కెళ్ళి శిరోముండనం చేయించుకోవాలి లేదా తలవెంట్రుకలను కత్తిరించుకోవాలి. స్త్రీలు శిరోముండనం చేయించుకోకూడదు. వారు కొన్ని వెంట్రుకలు మాత్రమే కత్తిరిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ ఉమ్రా పూర్తయింది. ఇప్పుడు మీరు ఇహ్రాం నుంచి విముక్తి పొందారు. ఇహ్రాం సందర్భాన నిషిద్దమై ఉన్న వన్నీ ఇప్పుడు హలాల్ అవుతాయి. ఇది హజ్జే తమత్తుకి సంబంధించిన ఉమ్రా మరియు సంవత్సరం లో ఎప్పుడైనా చేసే ఉమ్రా విధానం. ఇక హజ్జే ఖిరాన్ కి సంబంధించిన ఉమ్రా గరించి తెలుసుకుందాం. మీరు హజ్జే ఖిరాన్ చేస్తున్నట్లయితే మక్కా వెళ్ళగానే కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత, రెండు రకాలు నమాజు చేసి, సఫా మర్వాల మధ్య సయీ చెయ్యాలి. కానీ హజ్ పూర్తి అయ్యే వరకు శిరోముండనం చెయ్యకూడదు. హజ్జే ఇఫ్రాద్ చేస్తున్నట్లయితే తవాఫ్ ఖుదూమ్ తరువాత హజ్ సయీ చెయ్యవచ్చు లేదా తవాఫ్ ఇఫాద అనంతరం సయీ చేయవచ్చు. అంటే తవాఫ్ ఖుదూమ్ నుండి హజ్ పూర్తయ్యే వరకూ ఇహ్రాంలోనే ఉంటారు.

معلومات المادة باللغة الأصلية